క్యాల్షియం తక్కువగా వుందా..? అయితే ఈ ఆయుర్వేద పద్ధతులని ఫాలో అవ్వండి..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమయ్యే పోషక ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, క్యాల్షియం ఇవన్నీ కూడా సరిగా అందేటట్టు చూసుకోవాలి. కాలుష్యం కూడా మన ఒంటికి చాలా అవసరం. ముఖ్యంగా పంటి ఆరోగ్యానికి క్యాల్షియం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పెద్దవాళ్లు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.

 

కాల్షియం లోపం ఉంటే ముఖం అలసిపోయినట్లు ఉంటుంది. అలానే దంత సమస్యలు, డ్రై స్కిన్, మజిల్ క్రాంప్స్, ఎముకల సమస్యలు కూడా ఉంటాయి. అయితే కాల్షియం లోపం ఉన్న వాళ్లు దాన్ని లైట్ తీసుకోవడం మంచిది కాదు.

క్యాల్షియం లోపం ఉన్న వాళ్ళు దాని నుంచి బయటపడాలని డాక్టర్ చెప్తున్నారు. అయితే క్యాల్షియం లోపం ఉన్న వాళ్ళు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాల పాటు ఎండలో ఉండటం మంచిదని చెప్పారు. కాల్షియం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది కనుక కాల్షియం లోపం ఉన్న వాళ్లు వీటిని తీసుకుంటే మంచిది. మరి ఇక వాటి కోసం చూసేద్దాం.

ఉసిరి:

ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. మీరు పచ్చి ఉసిరికాయలు తినొచ్చు లేదంటే పౌడర్, జ్యూస్ అయినా సరే తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే క్యాల్షియం మీకు అందుతుంది. దీనితో మోకాళ్ళ నొప్పులు, దంత సమస్యలు వంటివి తొలగిపోతాయి.

నువ్వులు:

నువ్వులు కూడా క్యాల్షియం ని అందిస్తాయి. తెల్ల నువ్వులని కానీ నల్ల నువ్వులని కానీ మీరు బెల్లం, నెయ్యి తో పాటు ఉండలు కింద చేసుకుని తీసుకోవచ్చు ఇది కూడా కాల్షియం ని అందిస్తుంది.

పాలు:

పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది పాలను తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. కాబట్టి ప్రతీ రోజు ఒక గ్లాసు పాలని కచ్చితంగా తీసుకుంటూ వుండండి.

మునగాకు:

ఇది కూడా కాల్షియం లోపం నుంచి బయటపడేస్తుంది. ప్రతిరోజు ఉదయం మునగాకు పొడి ని కాళీ కడుపునా తీసుకుంటే మంచిది ఇలా క్యాల్షియం సమస్యల నుంచి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news