టిక్ టాక్ కోసం వీడియో తీస్తుండగా పిస్తోల్ పేలి యువకుడి మృతి

-

ఈ యాప్ లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ అప్ లోడ్ అవుతోందని మద్రాస్ హైకోర్టు ఈ యాప్ ను బాన్ చేయాలని టిక్ టాక్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. అడల్ట్ కంటెంట్ లేకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తం అని టిక్ టాక్ హై కోర్టు కు తెలిపింది.

టిక్ టాక్… ఇదో మొబైల్ యాప్. చైనా కు చెందిన ఈ యాప్ కు భారత్ లో ఫుల్లు ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ దీనికి బానిస అయిపోయారు.

తక్కువ నిడివి ఉన్న వీడియోస్ ను ఇందులో అప్లోడ్ చేయాలి. ఆ వీడియోను చూసి మిగితా యూజర్లు లైకులు కామెంట్లు చేస్తుంటారు. ఎవరికి ఎక్కువ లైకులు , కామెంట్లు వస్తె వాళ్ళు గ్రేట్ అన్నట్టు. వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆ కిక్కు కోసమే యూత్ ఈ యాప్ కు బానిసలయ్యారు. అయితే ఈ యాప్ లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ అప్ లోడ్ అవుతోందని మద్రాస్ హైకోర్టు ఈ యాప్ ను బాన్ చేయాలని టిక్ టాక్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. అడల్ట్ కంటెంట్ లేకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తం అని టిక్ టాక్ హై కోర్టు కు తెలిపింది.ఇది ఇలా ఉంటే.. టిక్ టాక్ లో వీడియోస్ పెట్టడం కోసం యూజర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. వీడియో తీసే మోజులో పడి తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. దానికి ఉదాహరణే ఈ ఘటన. ఢిల్లీ కి చెందిన సల్మాన్, అమీర్, సొహెల్ ముగ్గురు నిన్న రాత్రి ఇండియా గేట్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సోహెల్ టిక్ టాక్ వీడియో తీసేందుకు తన దగ్గర ఉన్న నాటు తుపాకీని సల్మాన్ కు గురి పెట్టాడు. వీడియో తీస్తున్నాడు.



ఇంతలోకారు కుదుపులకు గురయింది. దీంతో సోహెల్ చేతిలో ఉన్న గన్ ప్రమాద వశాత్తు పేలింది. దీంతో సల్మాన్ కు గాయాలయ్యాయి. అయితే గాయపడిన సల్మాన్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తమ బంధువుల ఇంటికి తీసుకెళ్ళి అక్కడ రక్తపు మరకలు అంటిన డ్రెస్సులను మార్చుకొని బంధువుల సాయం తో సల్మాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సల్మాన్ చనిపోయాడు. ఈ ఘటన పై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news