మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆహార అనుబంధ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆహార అనుబంధ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ కూడా అప్లై చేసుకోచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే… రాతపరీక్ష ద్వారా ఈ పోస్టులకి ఎంపిక చేయనున్నారు. వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్థులకు 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతల వివరాల లోకి వెళితే.. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ / బీ.టెక్ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. పూర్తి వివరాలని నోటిఫికేషన్ లో చూడచ్చు. దరఖాస్తు చివరి తేదీ మే 09, 2022. పూర్తి వివరాలను https://drive.google.com/file/d/15gyIw_FKWulMCgghTowbJw8hERn-MfY3/view లో చూడచ్చు.