ఏపీకి 20 మిలియన్‌ యూరోలను ఇవ్వనున్న జర్మనీ ప్రభుత్వం

-

వినూత్న వ్యవసాయ పద్ధతులపై నీతిఆయోగ్‌ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వచ్చే ఐదేళ్లలో 20 మిలియన్‌ యూరోలను జర్మనీ ప్రభుత్వం సమకూరుస్తుందని.. ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు తగిన విధంగా అండగా నిలిచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై తగిన కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలని వెల్లడించారు. నేచరల్‌ వ్యవసాయంకోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని వెల్లడించారు.
90శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని కోరుతున్నానని.. మన సమాజం ఆరోగ్యంగా ఉంచడానికి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించాలని డిమాండ్ చేశారు.

పురుగుమందులు, రసాయన ఎరువులను కాకుండా సేంద్రీయ విధానాలవైపునకు వెళ్లాలని.. ఇప్పటికే రాష్ట్రంలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంకోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారని.. 10,778 రైతు భరోసాకేంద్రాల్లో 3009 చోట్ల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు.

రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపునకు మా ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని ప్రకటన చేశారు. ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటకే అన్నిరకాల సేవలు అందుతున్నాయని.. 10778 ఆర్బీకేలు రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయానికి బలం ఇవ్వడానికి ప్రత్యేకంగా కస్టహ్‌హైరింగ్‌ సెంటర్లనుకూడా ఏర్పాటు చేశామని.. అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు ఒన్‌స్టాప్‌ సెంటర్‌గా ఆర్బీకేలు పనిచేస్తున్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో కల్తీలను పూర్తిగా నివారించడమే కాకుండా, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకేల ద్వారా అందిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news