రాణిగంజ్‌లోని ఫిలిప్స్ లైట్స్ గోదాంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చేలరేగాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. షాప్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరుగుండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మంటలు గోదాంలో వ్యాపించడంతో గోదాంలోని ఎలక్రానిక్ వస్తువు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఏడాదిలో ఇదే షాప్ లో రెండో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. గత జనవరిలో కూడా ఇదే షాప్ లో అగ్నిప్రమాదం జరిగింది. అయినప్పటికీ ఫైర్ సెఫ్టీ నిబంధనలు వేద్ ఎలక్ట్రానిక్ షాప్ యాజమాన్యం పాటించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.