ఏంటీ పవన్‌ డిగ్రీ చదివాడా..? పవన్‌ కళ్యాణ్‌ చదువుపై మళ్లీ రచ్చ

-

పవన్‌ కళ్యాణ్‌ ఏం చదువుకున్నాడు..? అంటే పవన్‌ ఫ్యాన్స్‌ టక్కున చెప్పేస్తారు ఇంటర్‌ అని. ఎందుకంటే చాలా ఆడియో ఫంక్షన్స్‌లో స్వయానా పవన్‌ కళ్యాణే చెప్పాడు. తనకు చదువు అబ్బలేదని ఇంటర్‌ వరకు కూడా అతి కష్టంమీద చదివినట్టు. తన క్వాలిఫికేషన్‌ ఇంటర్‌ అని ఎన్నికల అఫిడవిట్లో కూడా పెట్టాడు పవన్‌. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ చదువు గురించి ఆయన అన్న నాగబాబు చెప్పిన విషయమే.

నాగబాబు తాజాగా ఒక వీడియో చేశాడు. ఇంటర్‌ విద్యార్థులు ఫెయిల్‌ అయ్యామని సూసైడ్‌ చేసుకోవడం తప్పంటూ చెప్పుకొచ్చారాయన. తల్లిదండ్రుల తీరుపై, మన విద్యా వ్యవస్థపై విమర్శలు చేశాడు నాగబాబు. తమ తల్లిదండ్రులు తమని ఏనాడు చదువు గురించి ఒత్తిడి చేయలేదని, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి పెడుతున్నారని అన్నాడు. ఒత్తిడి తట్టుకోలేని పిల్లలు ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యుల చదువుల గురించి ప్రస్తావించాడు. చిరంజీవి డిగ్రీ పూర్తి చేశాడని, తన చెల్లెల్లలో ఒకరు ఎంబీబీఎస్‌, మరొకరు డిగ్రీ చదివారని చెప్పుకొచ్చాడు. ఇక తన తమ్ముడు ఇంటర్‌ పూర్తి చేశాక ఐటీలో డిగ్రీ పూర్తి చేశాడంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు..

ఇక్కడే నాగబాబు తప్పటడుగు వేశాడు.. పవన్‌ ఇంటర్‌ చదివానని చెబితే మీరేమో డిగ్రీ అంటున్నావంటూ నెటింజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. నాగబాబు ఉద్దేశ్యం మంచిదే కానీ ఇలా పవన్‌ డిగ్రీ చేశాడంటూ తమనెందుకు కన్ఫ్యూజ్‌ చేస్తున్నావంటూ ఆటాడుకుంటున్నారు.. మరి దీని కోసం మరో వీడియో చేస్తాడేమో నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news