‘గబ్బర్ సింగ్’ నటుడికి రోడ్డు ప్రమాదం

ఆ సినిమాలో విలన్ కు చెందిన గ్రూప్ గ్యాంగ్ తో పవన్ చేసే సందడి సీన్ అయితే మరిచిపోలేం. ఆ సినిమాకు ఆ సీనే హైలెట్ అని చెప్పుకోవచ్చు. గ్రూప్ లోని వ్యక్తులంతా ఇతర హీరోల ఇమిటేషన్ చేయడం, సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం.. ఇలా సరదాగా ఉంటుంది ఆ సీన్.

మీకు పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తెలుసు కదా. నిజం చెప్పాలంటే ఆ సినిమాయే పవన్ కల్యాణ్ సినిమా కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. అప్పటి వరకు వరుస ప్లాఫులతో సతమతమవుతున్న పవన్ కు గబ్బర్ సింగ్ సినిమా ఊరటనిచ్చింది. దీంతో పవన్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయిపోయారు.

Gabbar singh actor got injured in road accident

ఆ సినిమాలో విలన్ కు చెందిన గ్రూప్ గ్యాంగ్ తో పవన్ చేసే సందడి సీన్ అయితే మరిచిపోలేం. ఆ సినిమాకు ఆ సీనే హైలెట్ అని చెప్పుకోవచ్చు. గ్రూప్ లోని వ్యక్తులంతా ఇతర హీరోల ఇమిటేషన్ చేయడం, సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం.. ఇలా సరదాగా ఉంటుంది ఆ సీన్.

అయితే.. ఆ గ్రూప్ లో రాజశేఖర్ లా డ్యాన్స్ చేసి రాజశేఖర్ ను ఇమిటేట్ చేసిన ఆంజనేయులు అనే నటుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. అతడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇందిరా నగర్ లో ఉండే ఆంజనేయులు తన భార్యతో బైక్ పై జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. ఈసమయంలో ఆయన బైక్ ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆయన కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. ఆయన భార్యకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు.