బిల్లు కట్టకపోవడంతోనే బొత్స ఇంటికి కరెంట్ తీసెయొచ్చు… ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్

-

2014లో తెలంగాణ వచ్చినప్పుడు మీకు రాష్ట్రాన్ని నడపటం రాదని.. మమ్మల్ని పెట్టుకోండంటూ కొంతమంది సలహాలు ఇచ్చారని…కానీ ఇప్పుడు తెలంగాణ మరో స్థాయికి చేరుకుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బిల్లు కట్టకపోవడతోనే బొత్స ఇంటికి కరెంట్ తీసేసి ఉండవచ్చని రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇప్పుడు రెండు రోజులు కరెంట్ పోయే పరిస్థితి ఉందా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఇన్వర్టర్లు లేవని ఆయన అన్నారు. కేటీఆర్ కు ఫోన్ చేసిన వ్యక్తికే వైఎస్సార్సీపీ పార్టీ నేతలనే ఫోన్ చేయవని సలహా ఇచ్చారు. తెలంగాణ డెవలప్మెంట్ ను చూసి అంతా ప్రశంసిస్తున్నారని… వైఎస్ఆర్సీపీ ఎంపీలే స్వయంగా మేము సీఎం కేసీఆర్ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నారని రంజిత్ రెడ్డి అన్నారు. మేం ఎప్పుడు ఏపీతో పోల్చుకోలేదని… ఏపీతో, ఒడిశాతో పోల్చుకోనే అవసరం లేదని ఆయన అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ లో ఉందని.. ఇదొక్కటి చాలని ఆయన అన్నారు. డెవలప్మెంట్ ను చూసే ప్రజలు ఓటేస్తారని ఆయన అన్నారు.ఏపీలో నీళ్లు, కరెంట్ లేవని.. రోడ్లు  బాగా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి ప్రతిగా కేటీఆర్ వస్తే ఏపీ రోడ్లను చూపిస్తామని.. రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటే కరెంట్ లేదని జనరేటర్ వాడాల్సి వచ్చిందిన బొత్స సత్యనారాయణ కౌంటర్ వేశారు. దీనికి ప్రతిగా ఎంపీ రంజిత్ రెడ్డి బొత్స మాటలకు కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news