కాంబినేషన్ రిపీట్..సూపర్ స్టార్‌తో ఆ డైరెక్టర్ మరో సినిమా

-

సినిమా ఇండస్ట్రీలో ఓ దర్శకుడు, హీరో కాంబోలో వచ్చిన సినిమా సక్సెస్ అయితే చాలు..అభిమానులు వారి కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. సక్సెస్ ఫుల్ కాంబోగా వారు పేరు గాంచిన నేపథ్యంలో అలా కాంబోలో సినిమా రావాలని కోరుకుంటారు కూడా. అటువంటి సక్సెస్ ఫుల్ కాంబో డైరెక్టర్ అనిల్ రావిపూడి- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.

వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఎంటర్ టైన్మెంట్ ఆయుధంగా మలుచుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి తన దైన శైలిలో సినిమాలు తీసి సక్సెస్ అందుకుంటున్నారు దర్శకులు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ మూవీస్. కాగా ప్రజెంట్ ఆయన F3 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. ఇకపోతే తాను మహేశ్ బాబుతో మరో సినిమా చేయడానికి రెడీ గా ఉ న్నానని తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

మహేశ్ ఎప్పుడూ సినిమా మొదలు పెడదామంటే, అప్పుడు మొదలు పెడతానని, ఈ లోపు స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర దర్శకులు అనిల్ రావిపూడి. ఈ లోపు మహేశ్ కు, తనకు ఉన్న కమిట్ మెంట్స్ పూర్తవుతాయని చెప్పారు. అలా తమ కాంబోలో రాబోతున్న మరో సినిమా అప్ డేట్ ఇచ్చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

 

Read more RELATED
Recommended to you

Latest news