ఆర్టీసీ బస్సులో మరోసారి సజ్జనార్.. ఈ సారి మరో కార్యక్రమం

-

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు.. కొత్త కొత్త ఆలోచనలకూ శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. థ‌ర్స్‌డే- బ‌స్ డే పేరిట చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్టీసీ సేవ‌ల‌పై ప్ర‌యాణికుల అభిప్రాయాల‌ను స‌జ్జ‌నార్‌ నేరుగా తెలుసుకోనున్నారు.

కొత్త‌గా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం నాడు ఆయన హైద‌రాబాద్‌లోని సిటీ బ‌స్సుల్లో ప్ర‌యాణించిన స‌జ్జ‌నార్.. ఆయా బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న వారితో మాట్లాడారు. ఆర్టీసీ సేవ‌ల‌పై వారి అభిప్రాయాల‌ను, ఫిర్యాదుల‌ను కూడా తెలుసుకునే య‌త్నం చేశారు స‌జ్జ‌నార్. ప్ర‌యాణికుల‌తో పాటు ఆయా బ‌స్సుల్లో విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందితోనూ ముచ్చ‌టించారు స‌జ్జ‌నార్.

Read more RELATED
Recommended to you

Latest news