కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర పెంచుతామని, గిట్టుబాటు ధర వచ్చేలా కాంగ్రెస్ కొనుగోలు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వరి పంటకు కనీస మద్దతు ధర రూ. 1960 ఉందని… వరికి రూ. 2500తో క్వింటాల్ వడ్లు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని… మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ. 1870 ఉందని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రూ.2200 మొక్కజొన్న కొనుగోల చేస్తుందని… కందులు రూ. 6300 ఉందని రూ. 6700 లతో, పత్తి రూ. 6025 ఉందని… రూ. 6500 గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. మిర్చి రైతులు మోసపోకుండా క్వింటాల్ రూ. 15,000 లకు కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్, బీజేపీ మోసం చేసిందని… పసుపు రైతులను ఆదుకునేందుకు పసుపు క్వింటాల్ కు రూ. 12,000 లకు కొనుగోలు చేస్తాం… ఎర్రజొన్న రూ. 3500లతో కొనుగోలు చేయబోతున్నామని… చెరుకు రైతులకు క్వింటాల్ కు రూ. 4000, జోన్నలు క్వింటాల్ కు రూ. 3050కి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నామని ప్రకటించారు.
వరికి రూ. 2500 మద్దతు ధర, మొక్కజొన్న రూ. 2200, పత్తికి రూ. 6500 ధరలతో కొనుగోలు: రేవంత్ రెడ్డి
-