తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం.. ఏ ఒక్క వ్యక్తి కోసం తెలంగాణ ఏర్పడలేదని… యువకుల, వాళ్ల తల్లల కన్నీళ్లతో, రక్తంతో ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ సాధారణంగా ఏర్పడలేదని ఆయన అన్నారు. ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి… తెలంగాణ కలలు, ప్రగతి ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఒక కుటుంబానికే తెలంగాణ ఫలాలు అందాయని… ప్రజలకు ఏం ఒరగలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసి కూడా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని తెలిసి పార్టీకి నష్టం జరిగినా తెలంగాణను ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. కార్మికులు, రైతుల ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆశించామని… కానీ ఆ కల నెరవేరలేదని… ఇక్కడ ముఖ్యమంత్రి రాజు లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల బాధలను వింటాడని… కానీ రాజు జనాల బాధలు పట్టించుకోక తను చేయాలనుకున్నది చేస్తాడని రాహుల్ వివరించాడు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసీ కూడా తెలంగాణ ఏర్పాటు చేశాం: రాహుల్ గాంధీ
-