తెలంగాణలో వేలకోట్లు కేసీఆర్ చోరి చేశారని…. అలాంటి వారితో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, యావత్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసం చేసిన వారిని, వారితోని ఏ విధంమైన పొత్తు ఉండబోదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి బహష్కరిస్తామని హెచ్చరించారు. ఎంత పెద్దనేతనైనా ఉపేక్షించమని రాహుల్ గాంధీ అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తే టీఆర్ఎస్ పార్టీలోని కైనా, బీజేపీలోని కైనా వెళ్లండి అంటూ సూచించారు. మాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. మేం రాజులతో పొత్తు పెట్టుకోం అని.. మేం టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తామని… కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ కలలను నాశనం చేశాడో.. రైతులను, యువత నుంచి వేల కోట్లు కొల్లగొట్టాడో ఆయన్ను మేం వదిలిపెట్టం అని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడిన వారికి మాత్రమే టికెట్ ఇస్తామని… ఒక వేళ ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేయని వారు ఎంత పెద్ద వారైనా టికెట్ ఇవ్వమని హెచ్చరించారు.
టీఆర్ఎస్ తో పొత్తు అనే కాంగ్రెస్ నేతలను ఉపేక్షించం… ఎంతటి వారినైనా బహిష్కరిస్తాం: రాహుల్ గాంధీ
-