జగన్ ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుందని జగన్ తో సమానం అయిన మంత్రి పెద్దిరెడ్డే చెప్పారని రామయ్య అన్నారు. మూడేళ్ల పాలనతో జగన్ ఎంత మంది నేతల వ్యక్తి జీవితంలోకి చొరబడ్డారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో చెప్పాలని అన్నారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి వాస్తవాలతో సీఎం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేరపూరితమైన ఫోన్ ట్యాపింగ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. ట్యాప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ ముఖ్య నేతల ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో సీఎం జగన్ బయటపెట్టాలని అన్నారు.