ఆ వార్తలు నమ్మవద్దు.. యథావిధిగా ఇంటర్ పరీక్షలు..

-

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా.. బలపడిన వాయుగుండం తుఫానుగా మారి ఏపీ తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. అయితే ఈ తుఫాన్ కు అసనిని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే .. అసని తుఫాన్ ప్రభావం అధికంగా ఉండడంతో.. బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షను ఈ నెల 25కు వాయిదా వేసింది ఏపీ విద్యా శాఖ.. అయితే గురువారం కూడా నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్ష కూడా వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Telangana may postpone Inter exams in line with CBSE, says BIE | Hyderabad  News - Times of India

అయితే దీనిపై ఏపీ విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం యథావిధిగా కొనసాగుతాయని.. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారం, వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ద్వితీయ సంవత్సరం గణితం, వృక్ష, పౌరశాస్త్రం పరీక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news