సీఎం జగన్‌, వీఐపీల కాన్వాయి వాహనాల అద్దెకు రూ. 10 కోట్ల బడ్జెట్ !

-

సీఎం జగన్‌, వీఐపీల కాన్వాయి వాహనాల అద్దె నిమిత్తం రూ. 10 కోట్ల మేర బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది రవాణ శాఖ. ఈ మేరకు ప్రభుత్వానికి రవాణ శాఖ అధికారుల లేఖ రాసింది. రవాణ మంత్రితో ఇటీవల రవాణ శాఖ అధికారుల భేటీ అనంతరం లేఖ రాసిన రవాణ శాఖ… పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు కాన్వాయ్ కార్ల అద్దె నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంది.

ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని కోరిన అధికారులు… ఇప్పటి వరకు రూ. 17.31 కోట్లు గత మూడేళ్ల కాలంలో పెండింగులో ఉన్నాయని రవాణ శాఖ లెక్కలు చెబుతోంది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ప్రారంభం కావడంతో కాన్వాయ్ వాహనాల ఏర్పాటు తప్పనిసరని లేఖలో వెల్లడించింది. ఇందుకు ఏటా కనీసం రూ. 4.5 కోట్ల రూపాయలు అవసరమని లెక్కలేసిన రవాణా అధికారులు.. పెండింగ్ బిల్లుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ. 6.50 కోట్లు, అత్యల్పంగా రూ. 2.94 లక్షల కోట్లు ఉన్నట్టు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news