కేసీఆర్ ను గద్దె దించాాల్సిన అవసరం వచ్చిందని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కేసీఆర్ హామీ ఇచ్చినట్లు నీళ్లు, నిధుల, నియమకాలు వచ్చాయి..? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు చేపడుతామని ఆయన అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. బండి సంజయ్ ప్రసంగం విన్నతర్వాత కేసీఆర్ ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదని… బండి సంజయ్ ఒక్కరే సరిపోతుందని అమిత్ షా అన్నారు. తెలంగాణలో నిజాం పాలనను మార్చాలా..? వద్దా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర లేదని ఆయన అన్నారు. నా జీవితంలో ఇంత దరిద్రమైన పరిపాలనను చూడలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సర్కార్ ను కూలదోయండి అని పిలుపునిచ్చారు. మోదీ పాలన గురించి తెలంగాణ రైతులకు చాలా బాగా తెలుసని… మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మద్దతు ధరలు పెంచామని, భారత సర్కార్ ను దోషిగా నిలిపే ప్రయత్నం చేయవద్దని అమిత్ షా అన్నారు.
కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం వచ్చింది: అమిత్ షా
-