కేసీఆర్ తెలంగాణను బెంగాల్ చేయాలని చూస్తున్నారు: అమిత్ షా

-

ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్యలో నిందుతులను వదిలిపెట్టమని, శిక్షించి తీరుతామని అమిత్ షా హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని… కేసీఆర్ తెలంగాణను బెంగాల్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పైవ్ స్టార్ ఫామ్ హైజ్ లో పడుకుని ప్లాన్లు వేస్తున్నారని… ఎన్నికలు రేపు నిర్వహించినా బీజేపీ సిద్ధం అని అమిత్ షా అన్నారు. కేసీఆర్ కొడుకు, బిడ్దకు అధికారాలు ఇచ్చి సర్పంచులకు ఇవ్వలేదని విమర్శించారు. మేం మీకు, మజ్లిస్ లకు భయపడమని అమిత్ షా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని హామీ ఇచ్చి.. మజ్లిస్ కు భయపడి జరపడం లేదని ఆరోపించారు. మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలను విసిరిపారేయాలని…మేం విమోచన దినోత్సవం జరుపుతామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శించారు. ఇటువంటి సర్కార్ ను దించేందుకే సంగ్రామ యాత్ర చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని పథకాలను కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు. సైనిక్ స్కూల్ కోసం కేంద్ర ప్రతిపాదనలు పంపితే కేసీఆర్ ప్రభుత్వం భూమిని కూడా కేటాయించలేదని విమర్శించారు. మేం ఎన్నికలు కోసమే చూస్తున్నామని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. కుటుంబ పరిపాలను, అసమర్థ సర్కార్  తెలంగాణను పాలించలేవని ఆయన అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news