ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా త్వరలోనే చేస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

-

ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా త్వరలోనే చేస్తామని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి. 4వ ఏడాది వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు మీటర్లు బిగిస్తే ఉరి తాడు వేసుకునట్టే అని చంద్రబాబు అంటున్నారని.. గతంలో ఉచిత కరెంట్ అంటే కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాలన్నారు, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసి చూపారని గుర్తు చేశారు.

నేడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇది చేసి చూపుతారని.. దేశ విదేశాల్లో రైతు భరోసా పై చర్చ జరుగుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని.. ఆఫ్రికా దేశాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టాలని ప్రపంచబ్యాంకు కోరిందని వెల్లడించారు.

నూరు శాతం విద్యుత్ ఇస్తున్నామని.. కేవలం చంద్రబాబు మాత్రమే గోబెల్స్ ప్రచారం చేస్తారు, ప్రజలతో రాజకీయం చేస్తారని వెల్లడించారు. పూతలపట్టు నియోజకవర్గం లో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం అని.. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ సంబంధిత స్టాల్స్ ను పరిశీలించి, అధికారులను అభినందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news