Breaking : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీ తగ్గించిన కేంద్రం..

-

 

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త తెలిపింది. కొద్ది రోజులుగా భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం మే 21 పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Petrol, diesel prices today surges in Hyderabad, Delhi, Chennai, Mumbai on 09 June 2021

దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని ఆమె తెలిపారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతిఏటా దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గిపోనుంది. ఇక, తగ్గిన ఎక్సైజ్ సుంకం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొంత కాలంగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడిన వాహనదారులు తాజాగా కేంద్రం తగ్గించిన ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news