కరోనా గుండెనే టార్గెట్‌ చేస్తోందంట.. తాజా నివేదిక

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి గురించి రోజు విషయం వెలుగులోకి వస్తోంది. అయితే.. తాజా నివేదిక ప్రకారం.. కరోనా వైరస్‌ గుండెను టార్గెట్‌ చేస్తూ.. గుండె పనితీరుపై ప్రభావం చూపుతోందని వెల్లడైంది. వైరస్ ఊపిరితిత్తులో ఉండిపోయి వాటి పనితీరును దారుణంగా దెబ్బతీస్తుందని ఇప్పటి వరకు నిర్వహించిన పరిశోధనల్లో తేలగా, తాజాగా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, ఎన్‌హెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో మరో విస్తుపోయే విషయం వెల్లడైంది.

How Covid Can Also Damage Your Heart – Cleveland Clinic

కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు గుండె పనితీరును కూడా దారుణంగా దెబ్బతీస్తుందని ఈ పరిశోధనలో తేలింది. ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐసీయూలలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 121 మంది రోగులపై అధ్యయనం చేసిన అనంతరం వారీ విషయాన్ని వెల్లడించారు. తాము పరిశీలించిన ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె కుడివైపు దెబ్బతింటోందని, దీనివల్ల మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు పరిశోధకులు.

Read more RELATED
Recommended to you

Latest news