జ్వరాలు, ఇతర అనారోగ్యం వచ్చినపుడు యోగా చేయవచ్చా? చేస్తే కలిగే ఫలితాలేంటి?

-

యోగా.. భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన వ్యాయామ ప్రక్రియ. చాలామంది యోగాని భక్తితో చేస్తారు. దేవుడి మీద భక్తి యోగా చేయడం ద్వారా చూపిస్తారు. మరికొంత మంది ఆరోగ్యంగా ఉండడానికి యోగాని మించిన వ్యాయామం లేదై చేస్తారు. ఏది ఏమైనా యోగా పాటించడం మంచిదే. ఐతే జ్వరం, ఇతర అనారోగ్యం తలెత్తినపుడు యోగా చేయవచ్చా లేదా అనేది చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న. మరి దీనిపై నిపుణులు ఏమన్నారో ఇక్కడ చూద్దాం.

 

మీకు దెబ్బ తగిలి అది ఇబ్బంది పెడుతున్నప్పుడు, సర్జరీ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు యోగా చేయకపోవడమే మంచిది. యోగా చేస్తున్నప్పుడు భౌతిక గాయాలు ఇబ్బంది పెడతాయి. అందువల్ల ఆ టైమ్ లో యోగా చేయకపోవడమే కరెక్ట్.

కడుపుకి సంబంధించిన సమస్యలు, గ్యాస్, ఆసిడిటీ, కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నప్పుడూ, వాటి నుండి ఉపశమనం పొందడానికి యోగాలో మంచి మంచి ఆసనాలున్నాయి. అలాంటి టైమ్ లో ఆ ఆసనాలేంటో తెలుసుకుని, పాటించడం మంచిది.

అందుకే యోగా అనేది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదనేది తెలుసుకోవాలి. ఐతే ఎప్పుడైన్నా ఆరోగ్యం బాగాలేనపుడు, నీరసంగా మారి ఏమీ చేయలేకపోతున్నాం అని మీరనుకున్నప్పుడు కింద ఇచ్చిన వాటిని పాటించండి.

తక్కువ తినండి

జ్వరం కారణంగా శరీరంలో అన్ని అవయవాలు అంతకుముందు ఉన్నంత ఆరోగ్యంగా పనిచేయవు. అపుడు తక్కువ తింటే మంచిది. దానివల్ల జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి పడదు.

వ్యాయామం తగ్గించు

వ్యాయామ సమయాన్ని కూడా బాగా తగ్గించాలి. అంతకుముందు 45నిమిషాల పాటు వ్యాయామం చేసే వాళ్ళు 15నిమిషాలు మాత్రమే చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news