ఒడిశాలో తుపాను ప్రభావంతో ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తమ సెల్ ఫోన్లకు చార్జింగ్ లేక… తమ వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న బాధితులకు జనరేటర్ సాయంతో చార్జింగ్ కు అవకాశం ఇచ్చారు అక్కడి అధికారులు.
ఫొని తుపాను చల్లబడింది. ఒడిశాపై విరుచుకుపడిన ఫొని.. ఒడిశాను నాశనం చేసి వెళ్లిపోయింది. ఒడిశా సర్వనాశనం అయింది. మళ్లీ ఒడిశా మునుపటిలా పుంజుకోవడానికి ఎన్ని సంవత్సరాలు సమయం పడుతుందో తెలియదు. అయితే.. తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశాను ఆదుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సాయం చేశాయి. చాలామంది ఒడిశా తుపాను బాధితులకు అండగా నిలుస్తున్నారు.
మరోవైపు.. తుపాను వెళ్లిపోయాక.. తమ వాళ్ల జాడ కోసం.. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకోవడం తుపాను బాధితులు.. సెల్ ఫోన్ చార్జింగ్ కోసం ఎగబతున్నారు. దానికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తుపాన్ బాధితులు.. తమ వాళ్లకు ఫోన్లు చేయడం కోసం ఓ జనరేటర్ వద్ద గుమికూడి తమ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటున్నారు.
ఒడిశాలో తుపాను ప్రభావంతో ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తమ సెల్ ఫోన్లకు చార్జింగ్ లేక… తమ వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న బాధితులకు జనరేటర్ సాయంతో చార్జింగ్ కు అవకాశం ఇచ్చారు అక్కడి అధికారులు. దీంతో సెల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకొని తమ వాళ్ల జాడ కనుక్కునే పనిలో పడ్డారు బాధితులు.
After #FaniCyclone people of Odisha do their own bit of jugad to remain connected with their near and dear ones. #whatsappwonderbox @KarunaGopal1 @GabbarSanghi pic.twitter.com/UkJiBif0KU
— Maharana ଯାଯାବର (@SuvenduMaharana) May 5, 2019