ఊరిపై ప్రేమతో..అద్భుతాలను సృష్టించిన యువకుడు..

-

ఎక్కడేక్కడికో పోయి ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కష్టపడటం కన్నా కూడా సొంత ఊరిలో వచ్చిన పది రూపాయలు అయిన కూడా సుఖంగా బ్రతవచ్చు అని చాలా మంది ఉద్యోగాలను మానేసి సొంత ఊర్లకు వస్తున్నారు. అలా వ్యవసాయం చేసి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.తాజాగా ఆ జాబితాలోకి మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేరాడు..అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే ఓ యువకుడు సాగు బాట పట్టాడు. వ్యవసాయంపై ఆసక్తితో సొంతూరిలోనే ఉద్యాన పంటలు పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతుల్లో దానిమ్మ, మామిడి తోటలు సాగు చేసి రైతులకు ఆదర్శంగా నిలిచాడు.కర్నూలు జిల్లా వ్యక్తి అమెరికాలో పెద్ద ఉద్యోగం పొందాడు..అయితే చిన్నప్పటి నుంచి ఇష్టం కూడా ఉండటం తో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు.

ప్రతి సంవత్సరం స్వగ్రామానికి వచ్చేవాడు. ఇక్కడ ఉన్న పొలాలను పరిశీలించి పండ్లతోటల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఐదేళ్ల క్రితం సోదరులు మద్దిలేటి రెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టాడు. దానిమ్మ సాగుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాడు.పది ఎకరాల మామిడి తోట నుంచి రూ.20 లక్షల ఆదాయం పొందాడు. అనుకూలిస్తే దానిమ్మ కూడా ఆశించిన దిగుబడులు రావచ్చని చెబుతున్నాడు.

రసాయనాలకు దూరంగా ఉండాలని సొంతంగా 30కి పైగా ఆవులను పెంచుతున్నారు. రసాయన ఎరువులు పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువు వాడుతున్నారు. ఊర్లో పలువురు రైతులకు మధుకేశవరెడ్డి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వచ్చి ఏటా రెండు నెలలు పాటు ఇక్కడే ఉంటూ పండ్ల తోటల సాగులో నిమగ్నమై ఎంతో అనుభూతిని పొందుతున్నాడు. ఈయన ప్రోత్సాహంతో గ్రామంలో పలువురు పండ్ల తోటల సాగువైపు వెళుతున్నారు..అతను వేసిన మొదటి అడుగు ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు..లక్షల ఆదాయం, ఆరోగ్యం..నిజంగా అతడి ఆలోచన గ్రేట్ కదా..

Read more RELATED
Recommended to you

Latest news