ఒడిశాలో ఒకేసారి 20 మంది మంత్రులు రాజీనామా

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్‌లోని మంత్రులందరినీ రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి వర్గం ఒకేసారి రాజీనామా చేసింది. అలాగే స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు.

ఒడిశా అసెంబ్లీ
ఒడిశా అసెంబ్లీ

కాగా, సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ ప్రభుత్వానికి ఐదోసారి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మంత్రులు రాజీనామా చేసినట్లు సమాచారం. 2024 జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మంత్రులు పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ మేరకు 20 మంది మంత్రులు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించారు.

రేపు ఉదయం 11:45 నిమిషాలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రదీప్ అమత్, లతికా ప్రదాన్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.