ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. విద్యుత్ మీటర్ల గురించి ప్రతిపక్షాలు అబద్దపు మాటలు మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. మీటర్ సిస్టమ్ పెట్టిందే చంద్రబాబు అని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ మీటర్ సిస్టమ్ ప్రవేశపెట్టలేదని చంద్రబాబును చెప్పమనండి అని ఆయన సవాల్ విసిరారు. రైతుకు కావలసిన విద్యుత్ డైవర్షన్స్ ను అరికట్టేందకే ఈ మీటర్ల ప్రక్రియ అని ఆయన తెలిపారు.
విద్యుత్ మీటర్లు పెట్టక పోతే విద్యుత్ మిగిల్చుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. సిస్టమ్ కరెక్ట్ చేసి రైతులకు విద్యుత్ అందిస్తామంటే తప్పా అని ఆయన ప్రశ్నించారు. నాడు పెద్దలు నచ్చిన కంపెనీల వద్ద మాట్లాడుకోని అటే వెళ్లాలని రైతులకు చెప్పేవారని, నేడు ట్రాక్టర్లు , యంత్రాలు రైతులకు నచ్చిన దగ్గర కోనుగోలు చేసారన్నారు.గతంలో లంచం లేకుంటే వాహనాలు వచ్చేవికావని, నేడు రాజకీయ దళారీలు లేరు, జన్మభూమి కమిటీలు లేవు అంటూ ఆయన విమర్శించారు. నేడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నుంచి లబ్ది దారుడికి లబ్ది అందుతోందన్నారు. గడప గడపకూ వెళుతుంటే సంతోషం వ్యక్తం అవుతుందని, రైతు భరోసా కేంద్రాలను సందర్శించేందు వివిధ రాష్ర్టాల నుంచి ఎమ్మేల్యేలు వస్తున్నారని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు.