ఫ్యాక్ట్ చెక్: కేంద్ర పథకం కింద ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ.6,000 భృతి ఇస్తుందా?

-

ప్రధాన్ మంత్రి బేరోజ్‌గర్ భట్టా యోజన’ కింద నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నెలవారీ రూ. 6,000 సహాయం అందిస్తోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా వాట్సాప్‌లో ఒక వార్త వైరల్ అవుతోంది..

 

అందులో ఎముందంటే.. దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ.6,000 ఇవ్వనుంది. ‘ప్రధాన్ మంత్రి బెరోజ్‌గర్ భట్టా యోజన 2022’ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, దీని కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 6,000 లభిస్తుంది.

అయితే, ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ నివేదికపై వాస్తవ తనిఖీని నిర్వహించింది. ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని తేలింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్ ఏదీ అమలు చేయడం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని పీఐబీ కోరింది.

ఫేక్ న్యూస్‌ను వ్యతిరేకిస్తూ, పిఐబి ఒక ట్వీట్‌లో ఇలా రాసింది.కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 6000 వరకు నిరుద్యోగ భృతిని అందజేస్తోందని ఒక సందేశంలో క్లెయిమ్ చేయబడింది. #PIBFactCheck: – ఇది ఫేక్. కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదు..ఏదైనా కూడా అధికారికంగా ప్రకటిస్తుంది, దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి అని సూచించింది..

Read more RELATED
Recommended to you

Latest news