ఆఖరి గొర్రెలను కూడా వదలరా.. సబ్సీడీలో ఇప్పిస్తామంటూ రూ.8 కోట్లు బురిడి

-

మోసానికి కాదేది అనర్హం అన్నట్లు కొందరు కేటుగాల్లు సబ్సీడీలో గొర్రెలు ఇప్పిస్తామంటూ బురిడి కొట్టించారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ గొర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని ఆస‌రా చేసుకుని ఓ ముఠా జ‌నానికి భారీ కుచ్చుటోపీ పెట్టింది. ప్ర‌భుత్వ గొర్రెల పంపిణీ ప‌థ‌కం కింద గొర్రెలు కొనుగోలు చేసిన వారికి ప్ర‌భుత్వం నుంచి సబ్సీడీ ల‌భిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప‌థ‌కానికి బాగానే ఆద‌ర‌ణ ల‌భించింది. అదే స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ఆదారంగా జ‌నాన్ని భారీ ఎత్తున మోసం చేసిన ఘ‌ట‌న‌లు కూడా న‌మోద‌య్యాయి.

Telangana tops in sheep, goat numbers – Deccan News

ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో భాగంగా శుక్ర‌వారం ఓ భారీ మోసం వెలుగు చూసింది. ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప‌థ‌కం కింద స‌బ్సీడీకే గొర్రెల‌ను ఇప్పిస్తామంటూ స‌జ్జ శ్రీనివాస‌రావు, ల‌క్ష్మీ, కొల్లి అర‌వింద్‌లు జ‌నం నుంచి ఏకంగా రూ.8 కోట్లు వ‌సూలు చేశారు. రాష్ట్రంలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో వీరు మోసానికి పాల్ప‌డ్డారు. వీరి మోసంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వీరు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news