అక్రమ సంబంధాలు చివరి విషాదంతాలుగానే మిగులుతున్నాయి. అక్రమ సంబంధాలు జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. చాలాకాలం పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో దంపతులు విడాకులు తీసుకున్నారు. పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటున్న మహిళ అగరబత్తీల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది. అదే అగరబత్తీల ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
రెండు సంవత్సరాల నుంచి వివాహిత మహిళ, ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వివాహిత మహిళను రెండో పెళ్లి చేసుకోవాలని యువకుడు అనుకున్నాడు. ఇదే విషయం ప్రియురాలికి చెప్పాడు. అప్పటికే యువకుడికి పెళ్లి అయ్యి భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలుసుకున్న ప్రియురాలు రెండో పెళ్లికి నిరాకరించింది. నువ్వు మొదట నీ భార్యకు విడాకులు ఇవ్వు తరువాత రెండో పెళ్లి చేసుకుందామని ప్రియురాలు చెప్పింది. రెండో పెళ్లి గురించి ప్రియురాలితో మాట్లాడుతూ వెలుతున్న యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మహిళ మీద యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.