శ్రీలక్ష్మీ నరసింహస్వామి భోజన ప్రియుడు..ఆయనకు తృప్తిగా భోజనం ఎవరైతే అందిస్తారో వారి కోరికలను వెంటనే తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. సుప్రభాతం మొదలు…పవళింపు సేవ వరకు పలు సందర్భాల్లో ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తారు.మొదట స్వామి ఆరగించిన రకరకాల ప్రసాదాలను తర్వాత భక్తులకు అందజేస్తారు.
స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలను ఎప్పుడెప్పుడు సమర్పిస్తారో ఇప్పుడు చుద్దాము..
1.స్వామివారికి మొదట నైవేద్యంగా పంచామృతాలను సమర్పిస్తారు. అభిషేకానికి ముందు నైవేద్యంతో పాటుగా తాంబూలం ఇస్తారు.
2. ప్రతిరోజూ బ్రాహ్మీ ముహుర్తంలో ఉదయం5.30 గంటలకు దద్దోజనాన్ని నివేదిస్తారు.ఎందుకంటే శరీరంలో వేడిని నియంత్రించడంతోపాటు చలువ చేస్తుది. ఈ దద్దోజనం ఆవుపాలు, పెరుగు, శొంఠి,అల్లంతో వండుతారు. దీన్నే బాలభోగం అని కూడా పిలుస్తారు.
3. మధ్యాహ్నం 12గంటలకు మహారాజభోగం పేరుతో స్వామివారికి మహానైవేద్యం సమర్పిస్తారు. పులిహోర, శొండెలు,లడ్డూలు,జిలేబీలు,వడలు,బజ్జీలు, పాయసం,క్షీరాన్నం, కేసరిబాత్ నివేదిస్తారు.
4. సాయంత్రం ఆరాధన తర్వాత పులిహోర, దోసెలు,వడపప్పు, పానకం, వడలు నివేదిస్తారు.
5. ప్రతిశుక్రవారం ఊంజల్ సేవ సమయంలో క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ప్రత్యేక పూజలోనూ నివేదనలు ఉంటాయి. స్వామివారు ఈ నైవేద్యాలు ఆరగించి సంతుష్టుడు అవుతాడని భక్తులు నమ్ముతుంటారు..
ఆయనకు రుచికరమైన వంటలు అంటే మహా ఇష్టం… అందుకే ఆయన కడుపు నింపడం కోసం ప్రజలు ఏదొక అహారాన్ని తయారు చేసి పెడతారు.. స్వామివారి అనుగ్రహం పొందాలి, ఆయన ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ఇలా చెయ్యండి.