రజనీకాంత్‌తో శంకర్..స్పెషల్ ట్వీట్ చేసిన డైరెక్టర్

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబో సూపర్ హిట్ అని చెప్పొచ్చు. వీరి కాంబోలో వచ్చిన ‘శివాజీ’, ‘రోబో’ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. ‘2.0’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, తాజాగా వీరిరువురు కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను శంకర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.

రజనీ కాంత్ ను కలవడం సంతోషంగా ఉందని, ఆయనతో ‘శివాజీ: ద బాస్’ చిత్రం తీసి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలిసినట్లు తెలిపారు. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. వీరి కాంబోలో మరో చిత్రం రావాలని కోరుకుంటున్నారు.

ఈ కాంబినేషన్ లో మరో చిత్రం వస్తే కనుక అది ఈ సారి అంచనాలను మించి ఉండాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం..నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తన 169వ చిత్రం చేస్తుండగా, శంకర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్..‘‘ఇండియన్-2’’ సినిమా చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news