గ్రూప్‌-1 అభ్యర్థులకు శుభవార్త.. ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీలో గ్రూప్‌-1 అభ్యర్థులకు హైకోర్టు శుభవార్త చెప్పింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎట్టకేలకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్స్ సర్వీసుల్లో రీ వాల్యుయేషన్ లేదని, వాల్యుయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని హైకోర్టుకు ఏపీపీఎస్సీ న్యాయవాదులు తెలిపారు.

On Andhra Pradesh High Court's Order, Suspended Dr Sudhakar Rao Leaves  Mental Hospital, Gets Admitted To Private Facility

గ్రూప్-1 పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో తుది విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. షెడ్యూల్‌ ప్రకారంఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని, కోర్టు తుది తీర్పునకు లోబడి నియామకాలు జరపాలని సూచించింది. పిటిషనర్ల సమాధాన పత్రాలు, మార్కుల జాబితాను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.