దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా అగ్నీపధ్ పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి తానుకూల స్పందన రావడం మాట అటుంచితే.. యువత, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏంటి? అని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధం అవుతున్న చాలా మంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీహార్లోని ఆర్జెడి ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు( శనివారం) సాయంత్రం మీడియా సమావేశం ద్వారా అగ్నిపధ్ కు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.