అయ్యన్న అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

-

ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్‌ నెలకొంది. మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‌, మంత్రి రోజాపై అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే.. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. నిన్నరాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అయ్యన్నను అరెస్ట్‌ చేస్తారంటూ అనుచరుల ఆందోళన దిగారు. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ప్రచారంతో వాతావరణం వేడెక్కింది.

Andhra Pradesh: Case filed against TDP leader Ayyanna Patrudu over indecent remarks against chief minister

అయితే ఈ నేపథ్యంలో.. దీనిపై ఏఎస్పీ మణికంఠ మాట్లాడుతూ.. అయ్యన్న అరెస్ట్ కు ఎటువంటి చర్యలు లేవని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణం కూల్చివేతకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారని, ఆక్రమణల తొలగింపు సజావుగా జరిగేందుకు సహకరించమని యంత్రాంగం కోరిందని ఆయన వెల్లడించారు. అడ్డుకున్న వాళ్ళను నిరోధించేందుకు మాత్రమే మా బలగాలు మోహరించామని ఆయన పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అనేది ప్రచారం మాత్రమేనని ఆయన తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news