ఈ ఒక్క ఫోటో చాలు నక్క నాయుడు జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవటానికి ? : విజయసాయిరెడ్డి

-

టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై మరో సారి ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఈ ఒక్క ఫోటో చాలు నక్క నాయుడు జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవటానికి అంటూ 57 ఏళ్ల వయసులో డీఎస్సీ పోస్ట్‌ సంపాదించిన వ్యక్తి ఫోటోను షేర్‌ చేశారు విజయసాయిరెడ్డి.

ఇలాంటి కోటి మంది కళ్లల్లో వెలుగులు నింపారు జగన్ గారు… పేదల నోరుకొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టిన చరిత్ర గుంట నక్కదని అని మండిపడ్డారు. 1998 లో డిఎస్సీలో అర్హత సాధిస్తే నియామకాలు నిలిపేసి కక్షసాధించాడు. వాళ్ల భవిష్యత్తును చిదిమేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.

ఇక మరో ట్వీట్‌ లో ఏపీ అప్పులపై ట్వీట్‌ చేశారు సాయిరెడ్డి. రాష్ట్ర అప్పుల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు, ఎల్లో కులమీడియా కథనాల్లో వాస్తవం లేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2021–22లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో అతితక్కువగా ద్రవ్యలోటు (నికర అప్పు) 2.10 శాతం ఉన్నట్లు తేలిందని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news