అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగాసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ITBP సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు భారత్-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలు వేశారు..ఉత్తరాన లడఖ్ నుండి తూర్పున ఉన్న సిక్కిం వరకు, 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ITBP జవాన్లు యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఆక్సిజన్ కూడా సరిగా లభించని చోట యోగాసనాలు వేయడం సాహసం..నిజంగా ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్..
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లడఖ్‌లో పలువురు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది 17,000 అడుగుల ఎత్తులో యోగా చేశారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సిబ్బంది కూడా యోగా సెషన్‌ను నిర్వహించారు. ఇక్కడ జవాన్లు వరుసుగా 16,500 అడుగులు, 16,000 అడుగుల ఎత్తులో యోగా ఆసనాలు చేశారు.
అదే విధంగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్కి చెందిన హిమ్‌వీర్లు సిక్కింలో మంచు కురిసిన పరిస్థితుల్లోనూ 17,000 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ ఓ పాటను కూడా విడుదల చేశారు.అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కొన వద్ద ఉన్న హిమ్‌వీర్లు గుర్రాలతో యోగా సాధన చేశారు. కాగా.. 2015 నుంచి ప్రతీ యేటా జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోని వీర జవాన్లు వివిధ రకాల యోగాలను చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అందుకు సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…
blockquote class=”twitter-tweet”>
Himveers of Indo-Tibetan Border Police (ITBP) practice yoga at 17,000 feet in snow conditions in Sikkim on the 8th #InternationalYogaDay pic.twitter.com/SSgYg9S2n5
— ANI (@ANI) June 21, 2022
Himveers of ITBP practice yoga at high altitudes in Himalayas
Read @ANI Story | https://t.co/2mlbsALnQT#ITBP #InternationalYogaDay2022 #IndianArmy pic.twitter.com/kg3KVexG0t— ANI Digital (@ani_digital) June 21, 2022
Himveers of Indo-Tibetan Border Police (ITBP) perform Yoga in Ladakh at 17,000 feet, on the 8th #InternationalDayOfYoga pic.twitter.com/SpmFre6w1J
— ANI (@ANI) June 21, 2022