అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి: కల్వకుంట్ల కవిత

-

ఇందూరు లో అక్రమ మైనింగ్ కథనాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం స్పందించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ పై వస్తున్న ఫిర్యాదులు, కథనాలపై ఆయనతో చర్చించారు. ఈ విషయంలో సదరు వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుంట్ల కవితకు హామీ ఇచ్చారు కలెక్టర్.

కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే అక్రమ మైనింగ్ మాఫియా సహజవనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తోంది. ప్రభుత్వ స్థలంలో అభివృద్ధి పేరిట తవ్వుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మైనింగ్ మాఫియా దర్జాగా మొరం, మట్టి తోడుకెళ్తుంటే అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. దీని వెనుక భారీ మొత్తం చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news