హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నవదంపతులు.. ఖర్చు అన్ని కోట్లా..?

-

ఇటీవల జూన్ 9వ తేదీన మహాబలేశ్వరం లోని షెరటాన్ గ్రాండ్ హోటల్ లో చాలా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార అలాగే ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్. దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమాయనానికి పులిస్టాప్ పెడుతూ ఎట్టకేలకు నూతన జీవితంలోకి అడుగు పెట్టారు ఈ జంట. ఇక వివాహం అనంతరం తమకు ఇష్టమైన దైవం తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. అయితే అక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లోని మూడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగి వివాదాలకు తావు ఇవ్వగా.. ఈ విషయంపై నయన్, విఘ్నేష్ దంపతులు.. అది కావాలని చేసిన తప్పు కాదు అని , పొరపాటుగా అలా జరిగిపోయింది అని ఒక లెటర్ కూడా విడుదల చేశారు. విగ్నేష్ మాట్లాడుతూ స్వామి వారు అంటే తమ కుటుంబానికి ఎంతో భక్తి అని తెలిపారు.Nayanthara Vignesh Shivan Marriage Live News: Nayanthara, Vignesh Shivan tie the knot on June 9 in Mahabalipuram

ఇకపోతే వివాహం అనంతరం ఏకంగా లక్ష మంది అనాధ పిల్లలకు భోజనాలు కూడా పెట్టించారు. ఇకపోతే ఈ వివాహానికి నయనతార తల్లి అనారోగ్యకారణంగా హాజరు కానందున నవ దంపతులు ఇద్దరూ కేరళకు వెళ్లి నయనతార తల్లి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. హనీమూన్ ట్రిప్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది నయనతార. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు చేరుకున్న ఈ దంపతులు అక్కడ లగ్జరీ హోటల్ లో ఉన్నట్లు సమాచారం. ఇక పెళ్లైన ఫస్ట్ టూర్ కావడంతో ఈ టూర్ లో వాళ్లు చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు హనీమూన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు సైతం విఘ్నేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.Nayanthara Vignesh Shivan honeymooning in Thailand we cant keep our eyes off their romantic photos | Celebrities News – India TV

ఇక జీవితంలో గుర్తుండిపోయే లాగ నయనతార ఈ ట్రిప్ కోసం ఏకంగా రూ.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సమాచారం. లగ్జరీ హోటల్స్ తో పాటు అక్కడ బీచ్లో ఎంజాయ్ మెంట్లు, ఖరీదైన రెస్టారెంట్లు, భోజనాలు మొత్తంగా చూసుకుంటే ఈ ట్రిప్ కోసం ఆమె ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసిందని చెప్పడం తో ఈ విషయం కాస్త కోలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news