‘షంషేరా’ ట్రైలర్..రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్‌ యాక్షన్ అదుర్స్

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, వాణికపూర్ జంటగా నటించిన చిత్రం ‘షంషేరా’. కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ ఫిల్మ్ ట్రైలర్ ను విడుదల చేశారు.

తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం కొడుకు చేసే వీరోచిత పోరాటంగా సినిమా ఉండబోతున్నదని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. 1800ల ప్రాంతంలో జరిగిన కథగా సినిమా రూపొందింది. వచ్చే నెల 22న ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంజయ్ దత్ వయ్ లెంట్ అవతార్ లో కనిపించగా, ఆయనతో రణ్ బీర్ కపూర్ ఫైటింగ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మొత్తంగా చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్..వెరీ వయ్ లెంట్ అవతార్ లో ఇందులో కనిపించనున్నారు. స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడే తెగ యోధుడిగా రణ్ బీర్ వీరోచితంగా ట్రైలర్ లో కనిపిస్తున్నారు. ఇక వాణి కపూర్ తో రణ్ బీర్ సీన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news