Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

-

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ గతంలోనే ప్రకటించారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (Telangana Inter Results 2022) విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

TS Inter 1st Year Results 2022 With Marks, Name Wise Release Date

మొత్తం 9,07,393 మంది విద్యా‌ర్థులు ఇంటర్‌ పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యా‌రని తెలి‌పారు. అందులో 4,42,767 మంది సెకం‌డి‌యర్‌ విద్యా‌ర్థులు, 4,64,626 మంది ఫస్టి‌యర్‌ విద్యా‌ర్థులు ఉన్నా‌రని చెప్పారు. వీరంతా ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యా‌ప్తంగా 1,443 కేంద్రాల్లో పరీ‌క్షలు రాశా‌రని చెప్పారు. విద్యా‌ర్థులు ఒత్తి‌డికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించ‌వ‌చ్చని మంత్రి సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news