ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు మరో పార్టీ మద్దతు పలికింది. రాష్ట్రపతి అభ్యర్థిగా సోమవారం యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
సిన్హా నామినేషన్ వేసిన రోజుననే ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మజ్లిస్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కీలక ప్రకటన చేశారు. మజ్లిస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఉన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తారని సదరు ప్రకటనలో అసదుద్దీన్ ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేశారని, ఆ సందర్భంగానే ఆయనకు మద్దతు ప్రకటించానని ఆయన పేర్కొన్నారు ఓవైసీ.