లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించిన విజయశాంతి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ఒక ప్రత్యేకమైన బిరుదును కూడా పొందడం గమనార్హం. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో.. హీరోయిన్లు వస్తూ ఉంటారు .. పోతూ ఉంటారు. అయితే కొన్ని జోడీలు మాత్రమే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి వారిలో చిరంజీవి – విజయశాంతి జోడి కూడా ఒకటి. ఒకానొక సమయంలో ఈ జంట స్టార్ పొజిషన్లో కొనసాగింది .
ఇకపోతే అటు బాలకృష్ణతో 25 చిత్రాలకుపైగా నటించిన ఈమె.. చిరంజీవి తో కూడా 20 చిత్రాలకు పైగా నటించి మంచి ఇమేజ్ని సొంతం చేసుకుంది.. ఇక స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లి తెలంగాణ ఉద్యమం అంటూ బయటకు రావడం జరిగింది. దీంతో ఈమె తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన తరువాత సినిమాలలో నటించలేదు. ఇక ఆ పార్టీని కూడా పక్కకు నెట్టి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగింది. ఇక మళ్లీ ఎన్నో సంవత్సరాలు విరామం తీసుకొని సరిలేరు నీకెవ్వరు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ కనబడకుండా పోయింది. ఇదిలా ఉండగా చిరంజీవి, విజయశాంతి మధ్య గత రెండు దశాబ్దాలుగా మాటలు లేకపోవడానికి కారణం కూడా లేకపోలేదు.
ఇక అసలు విషయం ఏమిటంటే వీరిద్దరూ 20 సంవత్సరాల పాటు మాట్లాడుకోకపోవడానికి కారణం.. తెలంగాణ ఉద్యమం సమయంలో సినీ పరిశ్రమకి చెందిన నటీనటులను సపోర్ట్ అడిగితే ఎవరూ స్పందించలేదట. సహాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం స్పందించలేదని విజయశాంతి అప్పట్లో చాలాసార్లు బాధపడింది. ఇక అదే సమయంలో చిరంజీవితో కూడా మాట్లాడటం మానేసిందని సమాచారం.. ఇక అలా సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ముఖ్యంగా తనతో కలిసి నటించిన చిరంజీవి కూడా ఆమెకు సపోర్టు ఇవ్వకపోవడంతో పూర్తిగా మనస్థాపం చెంది ఇండస్ట్రీకి దూరం అయింది విజయశాంతి.