మొబైల్ అంటే..ఫోన్ కాల్స్, గేమింగ్ కోసమే కాదు.. అంతకు మించి. ప్రత్యేకంగా.. క్రిప్టోకరెన్సీ, ఎన్‌ఎఫ్‌టి ట్రేడింగ్ కోసం అలాగే డిజిటల్ ఆస్తులకు పటిష్ట భద్రత కల్పించే ఉద్దేశంతో..బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా ల్యాబ్స్ అనుబంధ సంస్థ అయిన సోలానా మొబైల్ ఇటీవల ‘సాగా’ అనే మొబైల్ విడుదల చేసింది. ఈ ఫోన్ హైలెట్స్ ఏంటంటే..!
Solana Saga ధర…
Solana Saga స్మార్ట్‌ఫోన్ ధరను $1,000గా నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 79,000 వరకూ ఉంటుంది..ఇప్పటికే కంపెనీ ముందస్తు ఆర్డర్‌లకు బుకింగ్ ప్రారంభించింది. ఇందుకోసం $100 రీఫండబుల్ డిపాజిట్ చేయాలట.
Solana Saga హైలెట్స్…
ఈ ఫోన్ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ, భద్రతపరంగా పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సాగా ఫోన్ ద్వారా web3లో లావాదేవీలు జరపడం అలాగే టోకెన్‌లు, NFTల వంటి డిజిటల్ ఆస్తులను మెయింటేన్ చేయడం సులభం, సురక్షితం అని చెబుతున్నారు.
ఈ Saga ఫోన్ ప్రముఖ Android డెవలప్‌మెంట్ కంపెనీ OSOM భాగస్వామ్యం ద్వారా తయారు చేశారు. ఇప్పటికే.. ఈ కంపెనీ Google, Apple, Intel కోసం కంప్యూటింగ్ హార్డ్‌వేర్‌ను రూపొందించడంలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంది.
Saga స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే, 12 GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ వంటి ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో డిజిటల్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి.
ఈ ఫోన్‌లో ఇన్ బిల్ట్‌గా సీడ్ వాల్ట్, ప్రైవేట్ కీలు, సీడ్ ఫ్రేజెస్, ఇతర సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచే సెక్యూరిటీ లేయర్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్‌లో మిగతా అన్ని రకాల యాప్‌లను, మొబైల్ బ్రౌజర్‌ను మాములు ఫోన్‌లో వాడినట్లే వాడుకోవచ్చు.
నేడు ఎంతో మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. దాదాపు ఈ సంఖ్య 7 బిలియన్ల వరకు ఉంటుంది. వీరిలో 100 మిలియన్ల ప్రజలు డిజిటల్ ఆస్తులను కలిగి ఉన్నారు. web3లో లావాదేవీల ప్రమాణాలను ఈ ఫోన్ పెంచుతుందని సోలానా సహ వ్యవస్థాపకుడు అనాటోలీ యాకోవెంకో అంటున్నారు. చూడాలి ఎంత వరకు ఫోన్ సెక్యురిటీ కల్పిస్తుందో.!
– Triveni Buskarowthu