మరో దారుణం.. లిఫ్ట్‌ ఇచ్చి తల్లి, కూతుర్లపై గ్యాంగ్‌ రేప్‌..

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోజు ఏదో ఒక చోట స్త్రీలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. హరిద్వార్‌లోని రూర్కీలో ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తెపై కదులుతున్న కారులో కొందరు కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన కారులో లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి సమయంలో పిరాన్ కలియార్ నుంచి ఇంటికి వెళుతుండగా సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడని చెప్పారు పోలీసులు. అప్పటికే సోనుతోపాటు అతని స్నేహితులు కొందరు కారులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ప్రమేంద్ర దోవల్ చెప్పారు.

Woman raped in moving car in Khordha; accused held, vehicle seized

సోను, అతని సహచరులు కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి కాలువ దగ్గర పడేశారు. ఆ మహిళ అర్థరాత్రి ఎలాగోలా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కారులో ఎంత మంది పురుషులు ఉన్నారో మహిళ సరిగ్గా చెప్పలేనప్పటికీ, కారును నడుపుతున్న వ్యక్తి పేరు సోను అని బాధితురాలు చెప్పింది.తల్లీకూతురిని రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో చేర్పించామని, వారికి జరిపిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించామని, అయితే ఇంకా వారి ఆచూకీ లభించలేదని పోలీసులు వివరించారు.