“కిక్ బాబు ఔట్… అండ్ సర్వ్ ద పీపుల్” మా నినాదం – విజయసాయిరెడ్డి

-

కిక్ బాబు ఔట్… అండ్ సర్వ్ ద పీపుల్ మా నినాదమని.. వచ్చే ఎన్నికల్లో ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళతామని వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… 2017లో ప్లీనరీ నిర్వహించామని.. 8,9 తేదీలకు ఒక ప్రాధాన్యత ఉందని చెప్పారు.

2027 లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ప్లీనరీకి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని.. అధ్యక్షుడి ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. పలు తీర్మానాలు, సవరణలు ప్లీనరీ ప్రతిపాదిస్తుందని వెల్లడించారు. ఐదేళ్ళ కిందట చారిత్రాత్మక ప్లీనరీని ఇదే ప్రాంతంలో నిర్వహించాం.. భవిష్యత్తు చిత్ర పటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. ఇది కేవలం పార్టీకి సంబంధించిన ప్లీనరీ మాత్రమే కాదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news