TRS v/s BJP: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్

-

తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలు పెట్టిన పొలిటికల్ ఫైట్‌ను.. టీఆర్ఎస్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ.. సంపకు మోడీ అంటూ ఫ్లెక్సీలపై రాసుకొచ్చారు. బాయ్ బాయ్ మోడీ అంటూ ట్యాగ్‌లైన్ రాశాను.

Flexi War in Hyderabad
Flexi War in Hyderabad

బీజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అలాగే ఫ్లెక్సీలు తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగింది. క్రేన్ సహాయంతో ఫెక్సీలను తొలగిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోలు నగరంలో వెలిశాయి. జులై 2, 3 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news