ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. మరో ఏడాది ఆ విధానం పొడగింపు..

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో శుభవార్త చెప్పింది. ఇప్ప‌టిదాకా అమ‌లు అవుతున్న వారానికి 5 రోజుల ప‌ని విధానాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ మేర‌కు గురువారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ. స‌చివాల‌యం, ఆయా శాఖాధిప‌తుల కార్యాల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

CBI case against Jagan back to square one?

వాస్త‌వానికి వారానికి 5 రోజుల ప‌ని విధానం ఈ నెల 27తోనే ముగిసింది. అయితే దానిని పొడిగించ‌డం గానీ, అస‌లు దానిపై స్పందిస్తూ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న రాని నేప‌థ్యంలో ఈ శ‌నివారం (జులై 2) విధుల‌కు హాజ‌రు కావాలా? వ‌ద్దా? అన్న సందిగ్ధంలో ఉద్యోగులు ప‌డిపోయారు. అయితే ఆ ప‌ని విధానాన్ని పొడిగిస్తూ ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news