తెలంగాణ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో మీరు చేస్తున్న ఆరాచకాలు హద్దులు దాటుతోంది. రైతుల పొలాల్లో నీళ్ల సంగతి దేవుడెరుగు.. వారి కళ్లలో మాత్రం నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారాలు చేసుకోవడం నాణేనికి ఒక వైపు మాత్రమే, కానీ నాణేనికి రెండో వైపు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవల్లి ప్రాజెక్టులో మీ రీడిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య ఒకటి నుంచి ఎనిమిదికి పెరిగింది. మొదట్లో ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపునకు గురైంది. రీడిజైన్ ఫలితంగా అదనంగా మరో ఏడు గ్రామాలు.. తెనుగుపల్లి, మదెల్లపల్లి, సోమాజితండా, చింతల్ తండా, పొత్తపల్లి, జాలుబాయి తండా, తిరుమల్ తండా మునిగిపోతున్నాయన్నారు. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం ధర 20 నుంచి 30 లక్షల రూపాయాలకు తక్కువ లేదని మీరే చెబుతున్నారు. గౌరవల్లి నిర్వాసితుల భూములకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తింపజేయడం లేదు. పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ.2.10 లక్షలు, మరికొందరికి రూ.6.90 లక్షల పరిహారం అందించినట్లు మీ అధికారులే చెబుతున్నారన్నారు.

 

 

 

కానీ అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదని, సామాజిక సర్వేలో చాలా మంది తప్పిపోయారని

నిర్వాసితులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు పూర్తికావొస్తున్నా 186 మందికి అసలు పరిహారమే అందలేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి. తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు.

 

 

 

నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసం. మీ ప్రభుత్వం నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలి. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. నిర్వాసితులు కోరుకున్న విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. 2013 భూసేకరణ చట్టం: ప్రకారం పరిహారం ఇవ్వాలి. లేకపోతే నిర్వాసితుల పక్షాన వారికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news