జగన్‌ను చూసి నేర్చుకోండి కేసీఆర్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

-

ప్రధాని మోడీ గత నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో భాగ్యనగరానికి వచ్చేసిన మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ రాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రిని గౌరవించడమెలానో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు ధర్మేంద్ర ప్రధాన్.

Dharmendra pradhan | Latest News on Dharmendra-pradhan | Breaking Stories  and Opinion Articles - Firstpost

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోకూడదని.. మోదీని ఈ దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిని చేశారన్నారు. ఏపీ వచ్చిన ప్రధానికి జగన్ ఎలాగైతే స్వాగతం పలికారో.. ఏ ముఖ్యమంత్రి అయినా అలాగే ప్రధానికి గౌరవం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారు ధర్మేంద్ర ప్రధాన్.

 

Read more RELATED
Recommended to you

Latest news