తెలంగాణకు విజయమ్మ…జగన్ అండతోనేనా?

-

ఎట్టకేలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఒకవైపు తెలంగాణలో షర్మిల వైఎస్సార్టీపీ పెట్టి అక్కడ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు..దీంతో షర్మిల పార్టీకి విజయమ్మ మద్ధతుగా ఉన్నారు. అయితే ఓ వైపు ఏపీలోని వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ..మరో వైపు షర్మిల పార్టీకి మద్ధతుగా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి విజయమ్మ..తాజాగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అది కూడా వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ ఈ ప్రకటన చేశారు. అయితే వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, జగన్..షర్మిల, విజయమ్మలని పక్కన పెట్టేశారనే కథనాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్లీనరీ సమావేశాలకు విజయమ్మ హాజరు కాకపోవచ్చని, అలాగే ఆమెని బలవంతంగా గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తప్పించబోతున్నారని ఓ సెక్షన్ మీడియాలో ప్రచారం జరిగింది.

మీడియాలో ప్రచారం జరిగినట్లు పదవికి రాజీనామా చేశారు గాని..ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాల్లో పాల్గొని…వైసీపీ నేతల మాదిరిగానే జగన్ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు..అలాగే చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియాపై విమర్శలు చేశారు. ఇదే క్రమంలో రెండు పార్టీల్లో ఉండటం కరెక్ట్ కాదని చెప్పి…విజయమ్మ వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో విజయమ్మకు..షర్మిల పార్టీకి పూర్తి స్థాయిలో మద్ధతు ఇచ్చే అవకాశం దక్కినట్లైంది.

అయితే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం, ఇప్పుడు విజయమ్మని అక్కడకు పంపించడం మొత్తం…జగన్ అండతోనే జరుగుతుందనే వాదన పోలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది…షర్మిల పార్టీ పెట్టినప్పుడే…దీని వెనుక జగన్ వెనుక ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు విజయమ్మని ఏకంగా తెలంగాణకు పంపించి…అక్కడ తన సోదరి షర్మిల పార్టీకి మద్ధతు ఉండేలా చేశారని తెలుస్తోంది. అంటే ఏపీలో రాజకీయం చేస్తూనే…తెలంగాణలో తన సోదరి ద్వారా జగన్ రాజకీయం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక తల్లిని కూడా తెలంగాణకు పంపి..అక్కడ రాజకీయాలని మరింత రసవత్తరంగా మార్చారని చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జగన్ ప్రభావం పరోక్షంగా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news